అంతర్వాణి
the inner voice
Saturday, September 15, 2012
బంగారు నాన్న బూడిదయ్యావా,
కన్నీటి సంద్రమున మమ్ము ముంచావా..
చిన్నారి తండ్రి పెళ్ళి చేయలేదని,
చింతించుచూ నీవు చితికి చేరావా..
భద్రంగ ఉండమని మాకు చెపుతూనే
బ్రహ్మాండనాయకుని నీవు చేరావా...
కొండంత అండగా ఉండేటి నీవు,
గోరంత దీపమై దివికేగినావా..
(తేది 11.09.2012 న మా నాన్న గారు పరమాత్మ సాన్నిధ్యం పొందిన సందర్భంగా)
Tuesday, March 15, 2011
ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాసుకున్న కవిత ఇది....అప్పుడు నా పరీక్షలు ఉండడం వల్ల ఇక్కడ రాయడానికి కుదరలేదు...ఈ వేళ ఆ తరుణం వచ్చిందని దీనిని ఇక్కడ నిక్షిప్తం చేస్తున్నాను
చీకట్లు తొలగించ సూర్యుడే కాదులే
చేతిలో ఉన్న చిరుదీపమైన చాలునే
అడుగు ముందుకు వేస్తే అభివృద్ధి సాధ్యమే
తలచి మేల్జేస్తే తలరాత మారులే..
"నా ఒక్కడివల్ల మార్పన్నది సాధ్యమా?"
అన్నన అటువంటి సందేహము వలదు
చినుకొక్కటే మొదలు పెనువరదకైనా
తొలి అడుగుతో మొదలు తారాపథమ్మైనా...
సదాశయం యెంచి
సన్మార్గమున చేరి
స్థిరచిత్తాచరణతో ముందుకు సాగిన
మారునోగ్రామము మండలము రాష్ట్రము
మారునీ దేశము మహియెల్ల కీర్తింప.....
చీకట్లు తొలగించ సూర్యుడే కాదులే
చేతిలో ఉన్న చిరుదీపమైన చాలునే
అడుగు ముందుకు వేస్తే అభివృద్ధి సాధ్యమే
తలచి మేల్జేస్తే తలరాత మారులే..
"నా ఒక్కడివల్ల మార్పన్నది సాధ్యమా?"
అన్నన అటువంటి సందేహము వలదు
చినుకొక్కటే మొదలు పెనువరదకైనా
తొలి అడుగుతో మొదలు తారాపథమ్మైనా...
సదాశయం యెంచి
సన్మార్గమున చేరి
స్థిరచిత్తాచరణతో ముందుకు సాగిన
మారునోగ్రామము మండలము రాష్ట్రము
మారునీ దేశము మహియెల్ల కీర్తింప.....
Sunday, July 4, 2010
సునామి వచ్చిన సంవత్సరంలోనే మా సెకండ్ ఇయర్ ఇంటర్నల్ పరీక్షల్లో నేను సరిగా మార్కులు సాధించలేదని మా ప్రొఫెసర్ తన చాంబర్ కి నన్ను పిలిచి చివాట్లు పెట్టాడు..అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి ఆలో చిస్తుండగా ఈ చిన్ని కవిత రాయడం జరిగింది
పడిలేచే కెరటం సైతం
చెబుతున్నది నీకో పాఠం
పడిపొతే ఓటమి కాదోయ్
మరిలేవకపొతేనేనొయ్ !
ఎగసి పడే అలల ఖడ్గం
తన గుండెను కొసేస్తున్నా
ఎదురునిలిచి పోరాడు తీరం లాగా
ధీరుడవై నిలవాలోయ్ !
వీరుడవై గెలవాలోయ్ !
పడిలేచే కెరటం సైతం
చెబుతున్నది నీకో పాఠం
పడిపొతే ఓటమి కాదోయ్
మరిలేవకపొతేనేనొయ్ !
ఎగసి పడే అలల ఖడ్గం
తన గుండెను కొసేస్తున్నా
ఎదురునిలిచి పోరాడు తీరం లాగా
ధీరుడవై నిలవాలోయ్ !
వీరుడవై గెలవాలోయ్ !
Saturday, June 19, 2010
ఈ కవిత కూడా నేను హౌస్ సర్జన్ గా ఉన్నపుడు రాసింది..ఒక వ్యక్తి జీవితం అంతా ఒక కవితలో చెప్పే ప్రయత్నంలో అది రాసాను...
నేడు నేను కళ్ళు తెరిచాను,
ఏదో కొత్త లోకం.
ఇన్నాళ్ళు నేనున్నదానికంటే అందంగా,
వర్ణరంజితంగా శతవిధకళాశోభితంగా,
అత్యంత సుందరంగా అనిపించిందీ లోకం,
భూలోకం.
నీలినింగిని చూసి అపుడాశించా దానిని అందుకోవాలని,
రెక్కలు లేని పక్షినైనందుకు వెళ్ళలేకపోయా.
తిరిగి చూస్తే పచ్చని ప్రకృతి,
చిగురుటాకులతో నవవసంతశోభతో ఉన్న చెట్లు
వాటిలా అనందంగా అందంగా ఎదగాలని ఆశపడ్డా.
కొన్నాళ్ళు గడిచాయి
"నింగిలో రాత్రి మాత్రమే ఎందుకు చుక్కలు ?"
"నే పగలు కూడా దానికి అద్దుతా చుక్కలు" అని చెప్పి
ఎగిరేసా గాలిపటాన్ని
అది నింగిని చేరి చుక్కయ్యింది.
పచ్చని ఆకులను ప్రక్కకునెట్టి
కొమ్మల చాటున దాగిన పండ్లకై
తిరిగా చెట్లవెంట .
ఆ తర్వాత
ఇవి కావు అందాలు ఇలలోన ,
నవ యవ్వనంతో నునుసిగ్గుల మొగ్గలతో,
అలరారే భామలదే అందం అనుకున్నా ,
చిరుప్రేమల చెలగాటంలో చిక్కుకున్నా,
విధి వైచిత్రిలో కొన్నాళ్ళు విచారించా విరహంతో.
మరలిపోయాయి ఆ రోజులు.
ఆ పై,
నేను ఒక ఇంటికి పెద్దగా,
నలుగురిని శాసించే వ్యక్తిగా అనుకున్నా,
సర్వహక్కులు నావేనని,
అందరూ నా మాటే వినాలని భావించా.
అటూ తర్వాత ,
"నేనెవరిని శాసించటానికి?"
"నేనెవరు?నాకు ఎందుకు ఈ జీవిత వరమిచ్చావయా?" అనుకున్నా .
"ఏమీ లేదు ఈ ప్రకృతిలో వేరువేరుగా అందం,
అంతా అంతర్లీన బ్రహ్మమయం" అని తెలుసుకున్నా.
సాయం సంధ్యలో ఉన్న నేను
మూగవోయి ఈ లోకంతో వీడుకోలు అన్నా,
అంతలో చేరుకున్నా,
ఆత్మానందతీరాన్ని
పరమాత్మ సాన్నిధ్యాన్ని .
నేడు నేను కళ్ళు తెరిచాను,
ఏదో కొత్త లోకం.
ఇన్నాళ్ళు నేనున్నదానికంటే అందంగా,
వర్ణరంజితంగా శతవిధకళాశోభితంగా,
అత్యంత సుందరంగా అనిపించిందీ లోకం,
భూలోకం.
నీలినింగిని చూసి అపుడాశించా దానిని అందుకోవాలని,
రెక్కలు లేని పక్షినైనందుకు వెళ్ళలేకపోయా.
తిరిగి చూస్తే పచ్చని ప్రకృతి,
చిగురుటాకులతో నవవసంతశోభతో ఉన్న చెట్లు
వాటిలా అనందంగా అందంగా ఎదగాలని ఆశపడ్డా.
కొన్నాళ్ళు గడిచాయి
"నింగిలో రాత్రి మాత్రమే ఎందుకు చుక్కలు ?"
"నే పగలు కూడా దానికి అద్దుతా చుక్కలు" అని చెప్పి
ఎగిరేసా గాలిపటాన్ని
అది నింగిని చేరి చుక్కయ్యింది.
పచ్చని ఆకులను ప్రక్కకునెట్టి
కొమ్మల చాటున దాగిన పండ్లకై
తిరిగా చెట్లవెంట .
ఆ తర్వాత
ఇవి కావు అందాలు ఇలలోన ,
నవ యవ్వనంతో నునుసిగ్గుల మొగ్గలతో,
అలరారే భామలదే అందం అనుకున్నా ,
చిరుప్రేమల చెలగాటంలో చిక్కుకున్నా,
విధి వైచిత్రిలో కొన్నాళ్ళు విచారించా విరహంతో.
మరలిపోయాయి ఆ రోజులు.
ఆ పై,
నేను ఒక ఇంటికి పెద్దగా,
నలుగురిని శాసించే వ్యక్తిగా అనుకున్నా,
సర్వహక్కులు నావేనని,
అందరూ నా మాటే వినాలని భావించా.
అటూ తర్వాత ,
"నేనెవరిని శాసించటానికి?"
"నేనెవరు?నాకు ఎందుకు ఈ జీవిత వరమిచ్చావయా?" అనుకున్నా .
"ఏమీ లేదు ఈ ప్రకృతిలో వేరువేరుగా అందం,
అంతా అంతర్లీన బ్రహ్మమయం" అని తెలుసుకున్నా.
సాయం సంధ్యలో ఉన్న నేను
మూగవోయి ఈ లోకంతో వీడుకోలు అన్నా,
అంతలో చేరుకున్నా,
ఆత్మానందతీరాన్ని
పరమాత్మ సాన్నిధ్యాన్ని .
Thursday, April 22, 2010
ఒక తెలుగు సినిమా లో ఈ పాట విని దాని పల్లవి తో మొదలపెట్టిన కవిత ఇది
ఈ క్షణం ఒకే ఒక కోరిక,
నీ స్వరం వినాలని తీయగా ,
తరగని దూరంలో,
తెలియని దారులలో,
ఎక్కడున్నావో ఎరుగక,
ఎలా ఉన్నవో తెలియక.
కొలనులోని కలువలలోనా?
కొమ్మ చివర చిగురులలోనా?
కోకిలమ్మ పాటలలోనా?
ఎక్కడున్నావో ఎరుగక,
ఎలా ఉన్నవో తెలియక.
నిప్పులోని స్వచ్చతలోనా?
నింగిలోని చంద్రునిలోనా?
నీలిమబ్బు నీడలలోనా?
ఎక్కడున్నావో తెలియక,
ఎలా ఉన్నావో ఎరుగక.
కంటికింపు రంగులలోనా?
కాంచనాల జిలుగులలోనా?
కాలి మువ్వల సవ్వడిలోనా?
ఎక్కడున్నావో తెలియక,
ఎలా ఉన్నావో ఎరుగక.
పారుతున్న యేటి గలగలలలోనా?
పాపికొండల నడుమ గోదారి అందాలలోనా?
పిల్లనగ్రోవి పలుకు రాగాలలోనా?
ఎక్కడున్నావో ఎరుగక,
ఎలా ఉన్నావో తెలియక.
రెప్ప చాటు దూరంలోనా?
కళ్ళలోని లోగిలిలోనా?
శ్వాసలోని అణువులలోనా?
గుండె గదుల లోతులలోనా?
ఎక్కడున్నావో ఎరుగక ,
ఈలా ఉన్నావో తెలియక,
ఈ క్షణం ఒకే ఒక కోరిక ,
నీ స్వరం వినాలని తీయగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక,
నీ స్వరం వినాలని తీయగా ,
తరగని దూరంలో,
తెలియని దారులలో,
ఎక్కడున్నావో ఎరుగక,
ఎలా ఉన్నవో తెలియక.
కొలనులోని కలువలలోనా?
కొమ్మ చివర చిగురులలోనా?
కోకిలమ్మ పాటలలోనా?
ఎక్కడున్నావో ఎరుగక,
ఎలా ఉన్నవో తెలియక.
నిప్పులోని స్వచ్చతలోనా?
నింగిలోని చంద్రునిలోనా?
నీలిమబ్బు నీడలలోనా?
ఎక్కడున్నావో తెలియక,
ఎలా ఉన్నావో ఎరుగక.
కంటికింపు రంగులలోనా?
కాంచనాల జిలుగులలోనా?
కాలి మువ్వల సవ్వడిలోనా?
ఎక్కడున్నావో తెలియక,
ఎలా ఉన్నావో ఎరుగక.
పారుతున్న యేటి గలగలలలోనా?
పాపికొండల నడుమ గోదారి అందాలలోనా?
పిల్లనగ్రోవి పలుకు రాగాలలోనా?
ఎక్కడున్నావో ఎరుగక,
ఎలా ఉన్నావో తెలియక.
రెప్ప చాటు దూరంలోనా?
కళ్ళలోని లోగిలిలోనా?
శ్వాసలోని అణువులలోనా?
గుండె గదుల లోతులలోనా?
ఎక్కడున్నావో ఎరుగక ,
ఈలా ఉన్నావో తెలియక,
ఈ క్షణం ఒకే ఒక కోరిక ,
నీ స్వరం వినాలని తీయగా
Saturday, April 17, 2010
మెడిసిన్ చదివే రోజుల్లో అప్పుడప్పుడు ఇలా కొన్ని కవితలు రాయటం జరిగింది..వీటికి ప్రేరణ ఎమిటి అంటే నాకు తెలీదు.అంతకు పూర్వం ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కూడా కొన్ని కవితలు రాసాను కాని వాటిలో చాలా కోల్పోయాను..హౌస్ సర్జన్ గా ఉన్నపుడు కనీసం మెడిసిన్ లో రాసినవైనా భద్రపరిస్తే బాగుంటుందని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు..తను నా కవితలకి ఒక మంచి విమర్షకుడు కుడా..ఇక అప్పట్నుంచి నా పుస్తకాలలో దొరికిన వాటిని ఇక్కడ భద్రపరుస్తున్నాను..
నువ్వు
మెరిసే తారను భువిపై చూద్దామనుకున్నాను
విరిసే పువ్వును నడిపిద్దామనుకున్నాను
నిన్ను చూసాను
అద్భుతం
అర చేతితో అంబరం అందుకుందామనుకున్నాను
అరమొడ్పు కనులతో అలవోకగా మట్లాడుదామనుకున్నాను
నిన్ను కలిసాను
ఆశ్చర్యం
చిలుకకు తియ్యని మాటలు నేర్పుదామనుకున్నాను
కోయిల పాటకు పల్లవినవుదామనుకున్నాను
నీ మాట విన్నాను
ఆహ్లాదం
శిలలకు అజరామరత్వం
సెలయేటికి అమ్రుతతత్వం
చిరుగాలికి తన్మయత్వం నేర్పుదామనుకున్నాను
నీ ప్రతి కదలిక కన్నాను
అనిర్వచనీయం
అద్భుతం
ఆశ్చర్యం
ఆహ్లాదం
అనిర్వచనీయం
నువ్వు
మెరిసే తారను భువిపై చూద్దామనుకున్నాను
విరిసే పువ్వును నడిపిద్దామనుకున్నాను
నిన్ను చూసాను
అద్భుతం
అర చేతితో అంబరం అందుకుందామనుకున్నాను
అరమొడ్పు కనులతో అలవోకగా మట్లాడుదామనుకున్నాను
నిన్ను కలిసాను
ఆశ్చర్యం
చిలుకకు తియ్యని మాటలు నేర్పుదామనుకున్నాను
కోయిల పాటకు పల్లవినవుదామనుకున్నాను
నీ మాట విన్నాను
ఆహ్లాదం
శిలలకు అజరామరత్వం
సెలయేటికి అమ్రుతతత్వం
చిరుగాలికి తన్మయత్వం నేర్పుదామనుకున్నాను
నీ ప్రతి కదలిక కన్నాను
అనిర్వచనీయం
అద్భుతం
ఆశ్చర్యం
ఆహ్లాదం
అనిర్వచనీయం
నువ్వు
Subscribe to:
Posts (Atom)