Saturday, April 4, 2009
శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు చరాచర స్రుష్టికంతటికీ ఆధారభూతమైన సర్వేశ్వరుడు సామన్య మానవునిగా జనియించి సత్య ధర్మ న్యాయ బద్ధముగా ఎలా జీవించవచ్చో విశ్వ మానవాళికి తెలియచెప్పిన్న అవతారం శ్రీ రామావతారం.సకల సుగుణధాముడైన శ్రీ రాముని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.ఒకే బాణము ఒకతె పత్ని అని అనాడే బహుభార్యత్వం వీడీనాడు.పిత్రు వాక్య పరిపాలన కోసమై పధ్నాలుగు సంవత్సరములు అడవులలో ఉన్నాడు.తల్లి మాట చెల్లించుటకై తమ్ముని భరతుని రాజ్య పట్టాభిషిక్తుని చేసినాడు.అన్నదమ్ములు ఎలా మెలగవలెనో చాటి చెప్పినాడు.రాజ్యాధినేతగా ప్రజలకు సుపరిపాలన అందించినాడు.రాజుగా తాను ప్రజలకు అదర్శప్రాయముగా ఉండవలెనని ఎవరో ఒక చాకలివాడు కూసిన కూతలకు ధర్మ పత్నినే వీడినాడు.జననము మొదలు అవతార పరిసమాప్తి వరకు నిత్యము కష్టములే అనుభవించినా ఎన్నడూ సత్య ధర్మ న్యాయములను విడనాడకున్న ఇనవంశోత్తముడు ఇక్ష్వాకు కుల తిలకుడు రఘు రాముడు.
Wednesday, April 1, 2009
జిలుగు వెలుగుల బంగారు తెలుగులోనే ఇక నా బ్లాగులో పోస్ట్స్ ఉండాలని అనుకుంటున్నాను ..కొద్ది రోజుల క్రితం తెలుగు బ్లాగుల గురించి ఒక పత్రిక ఆదివారం అనుబంధం లో చదివి నేను కూడా తెలుగు లో సాధ్యమైనంతవరకు మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాను .మన భాష ను మనమే మాట్లడకుంటే మరి దానికి ప్ర్రాచీన భాష హోదా ఇస్తేనేమి ఇవ్వకపోతేనేమి ?మరి మాత్రు భాష పరిరక్షణ అనేది అందరి బాధ్యత అని గుర్తెరిగి మనదైన మా మంచి తెలుగు పదాలలోని తియ్యదనంతో ఇక నా బ్లాగు కూడా తెలుగు సాహితీ సౌరభాలను మీ కందిస్తుందని సవినయంగా మనవి చేస్తూ
మీ భవదీయుడు
ఉదయ భాస్కర్ రావు వర్మ
మీ భవదీయుడు
ఉదయ భాస్కర్ రావు వర్మ
Subscribe to:
Posts (Atom)