ఒక తెలుగు సినిమా లో ఈ పాట విని దాని పల్లవి తో మొదలపెట్టిన కవిత ఇది
ఈ క్షణం ఒకే ఒక కోరిక,
నీ స్వరం వినాలని తీయగా ,
తరగని దూరంలో,
తెలియని దారులలో,
ఎక్కడున్నావో ఎరుగక,
ఎలా ఉన్నవో తెలియక.
కొలనులోని కలువలలోనా?
కొమ్మ చివర చిగురులలోనా?
కోకిలమ్మ పాటలలోనా?
ఎక్కడున్నావో ఎరుగక,
ఎలా ఉన్నవో తెలియక.
నిప్పులోని స్వచ్చతలోనా?
నింగిలోని చంద్రునిలోనా?
నీలిమబ్బు నీడలలోనా?
ఎక్కడున్నావో తెలియక,
ఎలా ఉన్నావో ఎరుగక.
కంటికింపు రంగులలోనా?
కాంచనాల జిలుగులలోనా?
కాలి మువ్వల సవ్వడిలోనా?
ఎక్కడున్నావో తెలియక,
ఎలా ఉన్నావో ఎరుగక.
పారుతున్న యేటి గలగలలలోనా?
పాపికొండల నడుమ గోదారి అందాలలోనా?
పిల్లనగ్రోవి పలుకు రాగాలలోనా?
ఎక్కడున్నావో ఎరుగక,
ఎలా ఉన్నావో తెలియక.
రెప్ప చాటు దూరంలోనా?
కళ్ళలోని లోగిలిలోనా?
శ్వాసలోని అణువులలోనా?
గుండె గదుల లోతులలోనా?
ఎక్కడున్నావో ఎరుగక ,
ఈలా ఉన్నావో తెలియక,
ఈ క్షణం ఒకే ఒక కోరిక ,
నీ స్వరం వినాలని తీయగా
Thursday, April 22, 2010
Saturday, April 17, 2010
మెడిసిన్ చదివే రోజుల్లో అప్పుడప్పుడు ఇలా కొన్ని కవితలు రాయటం జరిగింది..వీటికి ప్రేరణ ఎమిటి అంటే నాకు తెలీదు.అంతకు పూర్వం ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కూడా కొన్ని కవితలు రాసాను కాని వాటిలో చాలా కోల్పోయాను..హౌస్ సర్జన్ గా ఉన్నపుడు కనీసం మెడిసిన్ లో రాసినవైనా భద్రపరిస్తే బాగుంటుందని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు..తను నా కవితలకి ఒక మంచి విమర్షకుడు కుడా..ఇక అప్పట్నుంచి నా పుస్తకాలలో దొరికిన వాటిని ఇక్కడ భద్రపరుస్తున్నాను..
నువ్వు
మెరిసే తారను భువిపై చూద్దామనుకున్నాను
విరిసే పువ్వును నడిపిద్దామనుకున్నాను
నిన్ను చూసాను
అద్భుతం
అర చేతితో అంబరం అందుకుందామనుకున్నాను
అరమొడ్పు కనులతో అలవోకగా మట్లాడుదామనుకున్నాను
నిన్ను కలిసాను
ఆశ్చర్యం
చిలుకకు తియ్యని మాటలు నేర్పుదామనుకున్నాను
కోయిల పాటకు పల్లవినవుదామనుకున్నాను
నీ మాట విన్నాను
ఆహ్లాదం
శిలలకు అజరామరత్వం
సెలయేటికి అమ్రుతతత్వం
చిరుగాలికి తన్మయత్వం నేర్పుదామనుకున్నాను
నీ ప్రతి కదలిక కన్నాను
అనిర్వచనీయం
అద్భుతం
ఆశ్చర్యం
ఆహ్లాదం
అనిర్వచనీయం
నువ్వు
మెరిసే తారను భువిపై చూద్దామనుకున్నాను
విరిసే పువ్వును నడిపిద్దామనుకున్నాను
నిన్ను చూసాను
అద్భుతం
అర చేతితో అంబరం అందుకుందామనుకున్నాను
అరమొడ్పు కనులతో అలవోకగా మట్లాడుదామనుకున్నాను
నిన్ను కలిసాను
ఆశ్చర్యం
చిలుకకు తియ్యని మాటలు నేర్పుదామనుకున్నాను
కోయిల పాటకు పల్లవినవుదామనుకున్నాను
నీ మాట విన్నాను
ఆహ్లాదం
శిలలకు అజరామరత్వం
సెలయేటికి అమ్రుతతత్వం
చిరుగాలికి తన్మయత్వం నేర్పుదామనుకున్నాను
నీ ప్రతి కదలిక కన్నాను
అనిర్వచనీయం
అద్భుతం
ఆశ్చర్యం
ఆహ్లాదం
అనిర్వచనీయం
నువ్వు
Friday, April 16, 2010
అరుణోదయమవ్వాలని
అభ్యుదయం రావాలని
అడిగేవారు లేకున్నా
ఆగదు ఆ రథం అని
జనం “జనం” కారని
ప్రభంజనం మీరని
జనసామాన్యం నుంచే
జగజ్జేతలొస్తారని
ప్రతి మదిలో విప్లవాగ్ని రగిలించే నిప్పుకణిక కావాలని
జాగ్రుత నవభారత నిర్మాణపు రథ సారధి కావాలని
ఎదురుచూస్తుంది ఈ దేశం.
కుల మత విద్వేషాల కుమ్ములాటలో కుళ్ళినదై
కుటిల రాజకీయ కుతంత్రపు చక్రాల కింద నలిగినదై
అఙానపు అంధకారం అంతులేని పేదరికం అందించిన చేదు గుళికలతో మ్రగ్గినదై
నిర్జీవమై నిస్థేజమై
అనంతమైన బాధల బడబాగ్నులు గుండెలోన దహిస్తున్న
అంబరమంటు ఆర్తనాదాలు హ్రుదయాంతరాలలోన ధ్వనిస్తున్నా
చెదరని చిరునవ్వుతో చెలగిన చిరు ఆశతో
ఎదురుచూస్తుంది ఈ దేశం
నీవైనా కాకూడదా ఆ చైతన్య మూర్తి
అభివ్రుద్ధి పథం వైపు నడిపించు దీప్తి
అచలమై అనంతమై అఖిలమై
నవలోకపు తీరాలను చేర్చు నిత్య సత్య స్పూర్తి
నీవైనా కాకూడదా సమస్త జన సేనాధిపతి
అఖిలాండకోటి జనుల హ్రుదయాలలో వెలుగు ప్రజాపతి
సమసమాజనిర్మాణపు స్థపతి
మహాద్భుత మహోజ్వల మహోగ్ర రాజ్యోద్దీపనాద్యుతి
అభ్యుదయం రావాలని
అడిగేవారు లేకున్నా
ఆగదు ఆ రథం అని
జనం “జనం” కారని
ప్రభంజనం మీరని
జనసామాన్యం నుంచే
జగజ్జేతలొస్తారని
ప్రతి మదిలో విప్లవాగ్ని రగిలించే నిప్పుకణిక కావాలని
జాగ్రుత నవభారత నిర్మాణపు రథ సారధి కావాలని
ఎదురుచూస్తుంది ఈ దేశం.
కుల మత విద్వేషాల కుమ్ములాటలో కుళ్ళినదై
కుటిల రాజకీయ కుతంత్రపు చక్రాల కింద నలిగినదై
అఙానపు అంధకారం అంతులేని పేదరికం అందించిన చేదు గుళికలతో మ్రగ్గినదై
నిర్జీవమై నిస్థేజమై
అనంతమైన బాధల బడబాగ్నులు గుండెలోన దహిస్తున్న
అంబరమంటు ఆర్తనాదాలు హ్రుదయాంతరాలలోన ధ్వనిస్తున్నా
చెదరని చిరునవ్వుతో చెలగిన చిరు ఆశతో
ఎదురుచూస్తుంది ఈ దేశం
నీవైనా కాకూడదా ఆ చైతన్య మూర్తి
అభివ్రుద్ధి పథం వైపు నడిపించు దీప్తి
అచలమై అనంతమై అఖిలమై
నవలోకపు తీరాలను చేర్చు నిత్య సత్య స్పూర్తి
నీవైనా కాకూడదా సమస్త జన సేనాధిపతి
అఖిలాండకోటి జనుల హ్రుదయాలలో వెలుగు ప్రజాపతి
సమసమాజనిర్మాణపు స్థపతి
మహాద్భుత మహోజ్వల మహోగ్ర రాజ్యోద్దీపనాద్యుతి
Wednesday, April 7, 2010
ఈ కవిత నేను మెడిసిన్ లో ఉన్నపుడు గోదావరి పుష్కారాలపుడు రాసుకున్నది
పుష్కరాలు పుష్కారాలని
పుణ్యమెంతో కావాలని
గోదారిలో మునకేసి వస్తున్నారెందుకు జనం?
పుణ్యమే కావాలంటే కావాలి మంచి గుణం
ఉండాలి నీలోపల మానవత్వపు జీవకణం
నీతోటి జీవులను ప్రేమించు
కష్ట కాలమున వారికి సాయమందించు
మంచేదో చెడేదో మనసుతో ఆలోచించు
సద్భావన సద్బుద్ధితో నిత్యం ఆనందంగా జీవించు
జీవాత్మలోనే పరమాత్మ ఉన్నాడని గ్రహించు
ప్రతి మనిషిలోని దేవుణ్ని భక్తితో పూజించు
ఇంకెందుకు పుష్కరాలు
ఇంకెందుకు పుణ్యస్నానాలు
సర్వమానవ సౌభ్రాతృత్వ సమున్నత అభ్యుదయ భావనలే నీకు అభ్యంగనస్నానాలు
అనంతకోటి జీవనదుల పుష్కరఫల పుణ్యభరిత అమృత ధారలు
పుష్కరాలు పుష్కారాలని
పుణ్యమెంతో కావాలని
గోదారిలో మునకేసి వస్తున్నారెందుకు జనం?
పుణ్యమే కావాలంటే కావాలి మంచి గుణం
ఉండాలి నీలోపల మానవత్వపు జీవకణం
నీతోటి జీవులను ప్రేమించు
కష్ట కాలమున వారికి సాయమందించు
మంచేదో చెడేదో మనసుతో ఆలోచించు
సద్భావన సద్బుద్ధితో నిత్యం ఆనందంగా జీవించు
జీవాత్మలోనే పరమాత్మ ఉన్నాడని గ్రహించు
ప్రతి మనిషిలోని దేవుణ్ని భక్తితో పూజించు
ఇంకెందుకు పుష్కరాలు
ఇంకెందుకు పుణ్యస్నానాలు
సర్వమానవ సౌభ్రాతృత్వ సమున్నత అభ్యుదయ భావనలే నీకు అభ్యంగనస్నానాలు
అనంతకోటి జీవనదుల పుష్కరఫల పుణ్యభరిత అమృత ధారలు
Subscribe to:
Posts (Atom)