ఆ మధ్య ఎపుడో నేను హౌస్సర్జన్ గా ఉన్నపుడు కొన్ని కవితలు రాసాను.వాటిలో ఇది ఒకటి.అది రాయడానికి ప్రేరణ ఎవరు అని అడగకండి.ఎందుకంటే అది కేవలం నా ఊహా జనిత కవిత అంతే.
నీ వదనం నిత్య దరహాస సుమశోభితం,
నీ నయనం అమ్రుత వర్ష భరితం,
నీ పరిచయం అమూల్య రత్నఖచిత ఆర్జితం అస్మితం,
నీ ప్రతి పలుకు సుస్వరరాగరంజితం,
నీతో నాకిక లోకం సప్త వర్ణ భాసితం,
నీ కూడా కావాలి జీవితం మనోహర గీతం