ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాసుకున్న కవిత ఇది....అప్పుడు నా పరీక్షలు ఉండడం వల్ల ఇక్కడ రాయడానికి కుదరలేదు...ఈ వేళ ఆ తరుణం వచ్చిందని దీనిని ఇక్కడ నిక్షిప్తం చేస్తున్నాను
చీకట్లు తొలగించ సూర్యుడే కాదులే
చేతిలో ఉన్న చిరుదీపమైన చాలునే
అడుగు ముందుకు వేస్తే అభివృద్ధి సాధ్యమే
తలచి మేల్జేస్తే తలరాత మారులే..
"నా ఒక్కడివల్ల మార్పన్నది సాధ్యమా?"
అన్నన అటువంటి సందేహము వలదు
చినుకొక్కటే మొదలు పెనువరదకైనా
తొలి అడుగుతో మొదలు తారాపథమ్మైనా...
సదాశయం యెంచి
సన్మార్గమున చేరి
స్థిరచిత్తాచరణతో ముందుకు సాగిన
మారునోగ్రామము మండలము రాష్ట్రము
మారునీ దేశము మహియెల్ల కీర్తింప.....