Saturday, April 4, 2009

శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు చరాచర స్రుష్టికంతటికీ ఆధారభూతమైన సర్వేశ్వరుడు సామన్య మానవునిగా జనియించి సత్య ధర్మ న్యాయ బద్ధముగా ఎలా జీవించవచ్చో విశ్వ మానవాళికి తెలియచెప్పిన్న అవతారం శ్రీ రామావతారం.సకల సుగుణధాముడైన శ్రీ రాముని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.ఒకే బాణము ఒకతె పత్ని అని అనాడే బహుభార్యత్వం వీడీనాడు.పిత్రు వాక్య పరిపాలన కోసమై పధ్నాలుగు సంవత్సరములు అడవులలో ఉన్నాడు.తల్లి మాట చెల్లించుటకై తమ్ముని భరతుని రాజ్య పట్టాభిషిక్తుని చేసినాడు.అన్నదమ్ములు ఎలా మెలగవలెనో చాటి చెప్పినాడు.రాజ్యాధినేతగా ప్రజలకు సుపరిపాలన అందించినాడు.రాజుగా తాను ప్రజలకు అదర్శప్రాయముగా ఉండవలెనని ఎవరో ఒక చాకలివాడు కూసిన కూతలకు ధర్మ పత్నినే వీడినాడు.జననము మొదలు అవతార పరిసమాప్తి వరకు నిత్యము కష్టములే అనుభవించినా ఎన్నడూ సత్య ధర్మ న్యాయములను విడనాడకున్న ఇనవంశోత్తముడు ఇక్ష్వాకు కుల తిలకుడు రఘు రాముడు.

2 comments:

ప్రజ్వల్ said...
This comment has been removed by the author.
ప్రజ్వల్ said...

నమస్కారము సామ్రాట్ !!! శ్రీరాముని గూర్చి వ్రాసిన విషయములు బహు బాగుగనున్నాయి. ఈ విషయములు చూసి చాల సంతసించితిని. మీ అంతర్వాణి అమోఘం. మీ గురించి మీరు చెప్పుకున్న స్వగతం బాగుంది. ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్న బ్లాగు (క్షమించాలి 'బ్లాగు 'ను తెలుంగులో ఎటుల పిలుస్తారో తెలీయరాలేదు)కనిపించింది. మీకు తెలుంగు భాషపై నున్న మక్కువ, మమకారములు చూచి ముగ్ధుడనైతిని. ఇటువంటి విషయాలు మరెన్నో మాకు తెలియజేయగలరని ఆశిస్తూ . . .