Wednesday, April 7, 2010

ఈ కవిత నేను మెడిసిన్ లో ఉన్నపుడు గోదావరి పుష్కారాలపుడు రాసుకున్నది

పుష్కరాలు పుష్కారాలని
పుణ్యమెంతో కావాలని
గోదారిలో మునకేసి వస్తున్నారెందుకు జనం?
పుణ్యమే కావాలంటే కావాలి మంచి గుణం
ఉండాలి నీలోపల మానవత్వపు జీవకణం

నీతోటి జీవులను ప్రేమించు
కష్ట కాలమున వారికి సాయమందించు
మంచేదో చెడేదో మనసుతో ఆలోచించు
సద్భావన సద్బుద్ధితో నిత్యం ఆనందంగా జీవించు
జీవాత్మలోనే పరమాత్మ ఉన్నాడని గ్రహించు
ప్రతి మనిషిలోని దేవుణ్ని భక్తితో పూజించు
ఇంకెందుకు పుష్కరాలు
ఇంకెందుకు పుణ్యస్నానాలు
సర్వమానవ సౌభ్రాతృత్వ సమున్నత అభ్యుదయ భావనలే నీకు అభ్యంగనస్నానాలు
అనంతకోటి జీవనదుల పుష్కరఫల పుణ్యభరిత అమృత ధారలు

No comments: