Saturday, April 17, 2010

నువ్వు

మెరిసే తారను భువిపై చూద్దామనుకున్నాను
విరిసే పువ్వును నడిపిద్దామనుకున్నాను
నిన్ను చూసాను
అద్భుతం

అర చేతితో అంబరం అందుకుందామనుకున్నాను
అరమొడ్పు కనులతో అలవోకగా మట్లాడుదామనుకున్నాను
నిన్ను కలిసాను
ఆశ్చర్యం

చిలుకకు తియ్యని మాటలు నేర్పుదామనుకున్నాను
కోయిల పాటకు పల్లవినవుదామనుకున్నాను
నీ మాట విన్నాను
ఆహ్లాదం

శిలలకు అజరామరత్వం
సెలయేటికి అమ్రుతతత్వం
చిరుగాలికి తన్మయత్వం నేర్పుదామనుకున్నాను
నీ ప్రతి కదలిక కన్నాను
అనిర్వచనీయం

అద్భుతం
ఆశ్చర్యం
ఆహ్లాదం
అనిర్వచనీయం
నువ్వు

2 comments:

Anonymous said...

బావున్నాయన్దీ..మరిన్ని అందిస్తారా?

S.Uday Bhaskar Rao Varma said...

tappakunda andisthanu